తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీళ్లు అందించే ప్రయత్నంలో భాగంగా టీఆర్ఎస్ సర్కారు పలు ప్రాజెక్టులను నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే పలు ప్రాజెక్టు పనులు శరవేగంగా పూర్తి కానుండగా.. మరోవైపు కొన్ని ప్రాజెక్టుల నిర్మాణాలకు భూములను సేకరించే పనిలో ఉంది సర్కారు.
అందులో భాగంగా ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయే నిర్వాసితులకు దేశంలో ఎక్కడ లేని విధంగా.. ఇంతవరకు ఏ సర్కారు ఇవ్వని రీతిలో పరిహారం ఇస్తుంది టీఆర్ఎస్ సర్కారు.ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన సిద్దిపేట జిల్లాలో నిర్మిస్తున్న కొమురవెల్లి మల్లన్నసాగర్ రిజర్వాయర్ ముంపు గ్రామాల్లో పునరావాసం ,పరిహారం కింద ఇచ్చే చెక్కుల పంపిణీ కార్యక్రమం నిన్న మంగళవారంతో ముగిసింది.
దాదాపు పన్నెండు రోజుల పాటు సాగిన ఈ కార్యక్రమంలో మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశారు అధికారులు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద మొత్తం నాలుగువేల అరవై ఒక్క కుటుంబాలకు పరిహార చెక్కులను అందజేశారు. అయితే పద్దెనిమిది ఏండ్లు నిండిన 1,055మందికి సంబంధిత అధికారులు అందజేశారు. ఈ సందర్భంగా దేశంలో ఎక్కడ లేని విధంగా తమకు పరిహారం అందిందని నిర్వాసితులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.