ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాష్ సంతకం ఫోర్జరీ కేసులో పరారీలో ఉన్న సంగతి తెల్సిందే. అయితే తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగర హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఎన్ని నోటీసులు ఇచ్చిన కానీ విచారణకు హాజరు కావడం లేదు రవిప్రకాష్.
అయితే బెయిల్ గురించి రవిప్రకాష్ తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం హైకోర్టును ఆశ్రయించాడు రవిప్రకాష్.అంతేకాకుండా హైదరాబాద్ నగర సైబర్ క్రైం పోలీసులు తనపై నమోదు చేసిన కేసులు రాజ్యాంగ విరుద్ధమంటూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్పై అత్యవసరంగా విచారణ జరపాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. అయితే దీనిపై అత్యవసర విచారణ అవసరం లేదంటూ బిగ్ షాకిస్తూ పిటిషన్ను న్యాయస్థానం కొట్టేసింది.