తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల హాడావుడి నడుస్తోన్న సంగతి తెల్సిందే. గత ఏడాది డిసెంబర్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెల్సిందే. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎనబై ఎనిమిది స్థానాలను దక్కించుకుని వరుసగా రెండో సారి అధికారాన్ని చేపట్టింది. ఈ ఏడాది పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు ఈ నెల ఇరవై మూడో తారీఖున వెలువడునున్నాయి. తాజాగా ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి.
ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అనేక కారణాలతో ఖాళీ అయిన ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ షెడ్యూల్ ను విడుదల చేసింది. బీహార్లో రెండు స్థానాలు,తెలంగాణ ,మహారాష్ట్రాలల్లో ఒక్కోక్కస్థానానికి వచ్చే నెల జూన్ 7న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల ఇరవై ఒకటో తారీఖున కేంద్రం ఎన్నికల కమీషన్ ప్రకటించనున్నది.
ఇరవై ఎనిమిది తారీఖు వరకు నామినేషన్ స్వీకరణ జరుగుతుంది. ఆ తర్వాత రోజు ఇరవై తొమ్మిదో తారీఖున నామినేషన్లు పరిశీలిస్తారు.నామినేషన్లకు ఉపసంహారణకు గడవు ముప్పై ఒకటి. జూన్ ఏడువ తేదిన ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు లెక్కింపు కార్యక్రమం ఉంటుంది..