హైదరాబాద్ లోని వైస్సార్సీపీ కేంద్ర కార్యాలయాన్ని అమరావతికి తరలించారు.. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ వైసీపి ఆఫీస్ నుండి ఫర్నిచర్ ను, ఫైళ్లను అమరావతిలోని తాడేపల్లి వైసీపి కార్యాలయానికి సిబ్బంది తరలించారు. తాడేపల్లిలో ఇల్లు, పార్టీ కార్యాలయం నిర్మించుకున్న వైసీపీ అధినేత అందుకు తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అలాగే ఈ నెల 16న వైసీపి ఎంపీ, ఎమ్మెల్యే కౌంటింగ్ ఏజెంట్ల కు విజయవాడలో శిక్షణ కార్యక్రమం నిర్వహించనుంది పార్టీ.. ఈనెల 21లోగా పార్టీ కీలక నేతలంతా విజయవాడకు చేరుకునేలా ఇప్పటికే పార్టీ ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 22న తాడేపల్లికి జగన్ పూర్తిగా వెళ్లిపోనున్నారు. 22నుంచి మొత్తం పార్టీకి సంబంధించిన కార్యకలాపాలన్నీ తాడేపల్లి కార్యాలయం కేంద్రంగానే జరగనున్నాయి. ఈనెల 22వ తేదీన కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పార్టీ శ్రేణులు అప్రమత్తగా ఉండాల్సిన అంశాలపై జగన్ క్యాడర్ ను సమాయత్తం చేయనున్నారు. మొత్తమ్మీద గెలుపుపై ధీమాగా ఉన్న జగన్ పక్కాస్కెచ్ తో ముందుకెళ్తున్నట్టు కనిపిస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటివరకూ అమరావతిలో నివాసం నిర్మించుకోని విషయం తెలిసిందే.
