మనం రోజు రాగి పాత్రలో నీళ్లు త్రాగితే చాలా ఉపయోగాలు ఉంటాయని చెబుతున్నారు వైద్యులు. మన శరీరంలో కొత్త రక్తం తయరీకి ,కండరాలలో కణాల ఉత్పత్తిని పెంచుతుంది.ఒక రాగి పాత్రలో నీటిని పోసి కనీసం ఎనిమిది గంటలు పాటు ఉంచాలి. ఇలా ఉంచిన వాటినే మనం ప్రతి రోజు త్రాగాలి.
శరీరంపై ముడతలు ఎక్కువగా కన్పించకుండా రాగినీళ్ళు ఉపయోగపడుతుంది. రాగి నీళ్లు త్రాగడం వలన కడుపు ఉబ్బరం,కడుపు మంట నివారించబడుతుంది. గ్యాస్ నిర్మూలించబడుతుంది.
మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. రక్తకణాలను శుద్ధి చేయడం వలన శరీరంలో మలినాలు తగ్గుతాయి. దాంతో శరీర ఛాయ ప్రకాశిస్తుంది. రాగిపాత్రలో నిల్వ ఉంచిన నీరు త్రాగడం వలన జీర్ణ వ్యవస్థ సరిగ్గా పని చేస్తుంది.