ఏపీలో ఎప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ప్రముఖ సినీ హాస్య నటుడు పృద్వి, జోగి నాయుడు కాలి నడకన తిరుమల వెళ్లారు. అనంతరం తలనీలాలు సమర్పించుకున్నారు. పృథ్వి కొన్నాళ్ల క్రితం వైసీపీ లో చేరిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో వైసీపీ తరపున విస్తృతంగా ప్రచారం చేసిన ఆయన తాజాగా జగన్ సీఎం కావాలి అంటూ కాలినడక తిరుమల వెళ్లారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పాదయాత్రలో జగన్ వెంట నడిచినప్పుడు ఆయనకున్న ఆదరణ చూశాను. వైసీపీ 100కి పైగా సీట్లు గెలుస్తుంది. మొదటిసారి నడిచి తిరుమలకు వచ్చాను. 23న అమరావతిపై వైసీపీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు.