ఇటు తెలుగు రాష్ట్రాల్లో అటు మిగతా ల్యాంగేజ్ లలో టీవీ9 జెట్ స్పీట్ రేంజ్ లో దూసుకుపోతుంది. బాష ఏదైనా న్యూస్ ప్రజెంటేషన్ లో కొత్త పంథాను సృష్టించిన టీవీ9… సంస్ధ స్ధాపించినప్పటి నుంచి మొదటి స్ధానంలో కొనసాగుతుంది. ఇప్పటికీ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన న్యూస్ ఛానల్స్ కి ప్రధాన కారణం టీవీ9ని చూసే అని చెప్పుకోవచ్చు. అయితే టీవీ9 ఎంత రేటింగ్ సాధించిందో.. అంతే అప్రతిష్టను మూటకట్టుకుంది. సోషల్ మీడియాలో ఇప్పటికీ టీవీ9 తీరుపై కొన్ని వందల పోస్టులు వెల్లువెత్తుతుంటాయి. అయినా ఏ ఛానల్ సాధించని రెవెన్యూను టీవీ9 సాధిస్తుంది.ఏడాదికి టీవీ 9 ఎంత టర్నోవర్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.
టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాశ్‌పై ఫోర్జరీ ఆరోపణలతో టీవీ9 ఒక్కసారిగా రోడ్డుమీదకొచ్చింది. అందులో జరుగుతున్న ప్రతి విషయం ఇప్పుడు జనాల్లో గింగిరాలు తిరుగుతుంది. అనుహ్య పరిణామాల మధ్య టీవీ9 నుంచి రవిప్రకాష్ తొలిగించబడటం, కొత్త యాజమాన్యం రావటం చకచకా జరిగిపోయాయి. టీవీ 9 పేరుతో వివిధ భాషల్లో వార్తా ఛానళ్లను నిర్వహిస్తున్న ఆ సంస్థ 2017-18 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.200కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందని కేర్ రేటింగ్స్ వెల్లడించింది. అయితే దాదాపుగా రూ.5.86 కోట్ల నికర లాభం గడించిందని తెలిపింది.
ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు… కర్ణాటక మిగతా రాష్ట్రాల్లో టీవీ 9 చానల్స్‌కు అత్యంత ప్రజాదరణ ఉంది.అంతేకాదు అగ్రస్థానంలో నిలిచింది.మరోవైపు ఏబీసీపీఎల్ తీసుకున్న రూ.25 కోట్ల దీర్ఘకాలిక బ్యాంక్ రుణాలకు కేర్ బీబీబీ, స్టేబుల్ రేటింగ్‌ను ఇచ్చింది. రూ.15 కోట్ల స్వల్పకాలిక బ్యాంక్ రుణాలకు కేర్ ఏ3 రేటింగ్‌ను ఇస్తున్నట్లు కేర్ ఇటీవలి విడుదల చేసిన నివేదికలో ప్రకటించింది.
టీవీ 9 సక్సెస్ కి ప్రధాన కారణం దాని మేనేజ్ మెంట్, ప్రమోటర్లు ఆర్ధికంగా బలంగా ఉండటం. పొలిటికల్ గా తన స్టాండర్డ్ ని పెంచుకోవటం. దీంతో లాభాల పరంగా, బ్యాంకు రుణాల పరంగా సంస్ధ మంచి రేటింగ్ సాధించింది. ఏబీసీపీఎల్‌లో ప్రధాన ప్రమోటర్లుగా ఉన్న చింతలపాటి హోల్డింగ్స్, ఐలాబ్స్ వెంచర్ క్యాపిటల్ ఫండ్ సహా మైనారిటీ వాటాదారులు తమకు ఉన్న 90.54 శాతం వాటాలను అలందా మీడియాకు అమ్ముకుంది. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మై హోమ్ గ్రూప్, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ లు అలందా మీడియా గ్రూప్‌ను ప్రమోట్ చేశాయి.