యెడుగూరి సందింట రాజశేఖరరెడ్డి సంక్షేమం అంటే ఇప్పటికీ ఆయనపేరే గుర్తుకు వస్తుంది. అధికారం చేపట్టడానికి ముందు చేసిన పాదయాత్రలోనే పాలనా విధానాన్ని రచించుకున్న నాయకుడు రాజశేఖరరెడ్డి.. సరిగ్గా 15 ఏళ్ల క్రితం ఇదే రోజు తెలుగునేలపై రాజకీయ చిత్రాన్ని మార్చిన రాజశేఖరరెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. అప్పటికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడి విధానాల వల్ల రాష్ట్రంలో నెలకొన్న దుర్భర పరిస్థితుల్లో మండుటెండల్లో ప్రజలకోసం చేసిన పాదయాత్ర ఆయనలోని మంచి మనసును ఆవిష్కరించిన తీరు అధికారం చేపట్టిన తొలి నిమిషాల నుంచి మరణించేవరకూ పేదలకోసం ఆయన సాగించిన పాలనావిధానం రాష్ట్ర ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేసింది, అభివృద్ధి, సంక్షేమం జోడు గుర్రాలుగా వైఎస్ పాలన ప్రతీ వ్యక్తి గుండెల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకుందంటే ఎటువంటి ఆశ్చర్యం లేదు. ప్రజల మనస్సుల్లో నమ్మకమైన నాయకుడిగా నిలిచిన వైఎస్ ప్రజల ప్రేమాభిమానాలతోనే రెండోసారి కూడా సీఎం అయ్యారు. ప్రజలకోసం పోరాటాలు, దశాబ్ధాల పాటు నిరీక్షణ మధ్య వైయస్‌ఆర్ రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేనినేతగా ఆవిర్భవించారు. అదేవిధంగా పాదయాత్ర చేపట్టి ప్రజా సమస్య మూలాల్లోకి వెళ్లిన ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి మరో పదిరోజుల్లో 13జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారంటూ వైఎస్సార్సీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
