ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షల ఫలితాలు ఈ రోజు మంగళవారం విడుదలయ్యాయి.ఈ ఏడాది పదో తరగతిలో మొత్తం 94.88% మంది విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు.
మొత్తం ఆరు లక్షల ఇరవై వేల ఎనబై రెండు మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. అయితే 5464స్కూళ్లలో 100% ఉత్తీర్ణత వచ్చింది. అయితే ఈ రోజు విడుదల అయిన ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు.
బాలికలు ఉత్తీర్ణత శాతం 95.09%గా నమోదైంది. బాలురు మాత్రం 94.68% ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో తూర్పుగోదావరి జిల్లా 98.19%తో ముందు ఉంది. నెల్లూరు 83.19%తో చివరి స్థానంలో నిలిచింది.
ఫలితాల కోసం కింద ఇచ్చిన లింకులను సంప్రదించండి