తెలంగాణ రాష్ట్రంలో ఈ నెలలో జరగనున్న స్థానిక సంస్థల కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ఖరారు చేసింది.అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర నేతలు జాతీయ అధిష్టానానికి పంపిన జాబితాకు ఏఐసీసీ ఆమోదం తెలిపింది.
ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉదయ మహన్‌రెడ్డి, నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అభ్యర్థిగా కోమటిరెడ్డి లక్ష్మీరెడ్డి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ అభ్యర్థిగా ఇనుగుల వెంకట్రామిరెడ్డిల పేర్లను ఖరారు చేశారు.