2019 ఐపీఎల్-12 ఫైనల్ మ్యాచ్లో ముంబాయి ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ పై ఒక పరుగుతో గెలుపొంది వరుసగా నాలుగుసార్లు కప్పును కైవసం చేసుకుంది. అయితే ముంబాయి జట్టు కప్పు గెలవడంపై చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ,టీమ్ ఇండియా సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోనీ స్పందించాడు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ “ట్రోఫిని ముంబై,చెన్నై ఒకరి నుంచి మరోకరం మార్చుకుంటున్నాం అంతే”అని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంకా మాట్లాడుతూ”ఎంతో
కీలకమైన ఫైనల్ మ్యాచ్లో ఇరు జట్లు తప్పులు చేశాయి.
కానీ ముంబాయి తక్కువగా తప్పులు చేసింది. అందుకే ముంబాయి టైటిల్ గెలుపొందింది. ఛాంపియన్ గా నిలిచేందుకు ముంబాయి జట్టుకు అన్ని అర్హతలు ఉన్నాయని”ధోనీ అన్నాడు.