సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా మే 9న ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా రిలీజయ్యింది. ఈసినిమాలో మహేష్‌తో పాటుగా అల్లరి నరేష్ కూడా నటించారు. అయితూ ఆడియన్స్ ని నరేష్ నటన చాలా ఆకట్టుకుంది. దాదాపుగా కొన్నేళ్ల తర్వాత నరేష్‌ని ఇలాంటి క్యారెక్టర్‌లో చూడడం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చింది. మహర్షిలో రవిగా ప్రతీ ఒక్కరికీ గుర్తుండిపోయే క్యారెక్టర్ చేసాడు నరేష్.. సినిమాచూశాక నరేష్ క్యారెక్టర్ ని మర్చిపోయే వ్యక్తి ఉండడు అంతలా నరేష్ పాత్ర సినిమాలో కీలకయ్యింది. ఈ సినిమా విజయోత్సవం సందర్భంగా అల్లరినరేష్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో అందరి ప్రశంసలు అందుకుంటుంది.
17 సంవత్సరాల క్రితం ఒక యువకుడు అందరిలానే తన గమ్యాన్ని వెతుక్కుంటున్నాడు.. సినిమా పరిశ్రమలో నిలబడగలడా, లేడా అనే విషయం అప్పుడతనికి తెలియదు కానీ.. పట్టుబట్టి తన మనసు ఏం చెప్పిందో అదే విన్నాడు.. 2002 మే 10న ఆ కుర్రాడు ‘అల్లరి నరేష్’గా మరోసారి పుట్టాడు. అల్లరి సినిమా ఆడియన్స్ నన్ను యాక్సెప్ట్ చేసేలా చేసిందన్నారు.. చూడడానికి అందంగా లేని తనను ప్రేక్షకులు ఆదరించినందుకు వారికి రుణపడి ఉంటానన్నారు. ఇప్పుడెందుకీ విషయం చెబుతున్నాను, ఇండస్ట్రీలోకి వచ్చి 17 ఏళ్ళు అయిన తర్వాత ఎందుకిలా మాట్లాడుతున్నాను అంటే, దానికి కారణం ‘రవి’ అల్లరి సినిమాలో తన క్యారెక్టర్ పేరు ‘రవి’, మహర్షిలోనూ ‘రవి’నే..
ఈ 55 సినిమాల తన ప్రయాణం.. తన జీవితంలో ఎన్నో మధురమైన జ్ఞాపకాలను నింపిందన్నాడు నరేష్.. తను ఎదుగుదలకు కారణమైన చిత్ర పరిశ్రమకు.. తనపై నమ్మకం వుంచిన నిర్మాతలు, దర్శకులకు, సాంకేతిక సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదులు తెలుపుకుంటున్నానని అల్లరి నరేష్ చెప్పుకొచ్చారు. అయితే మీరు బావుంటారు.. మీ నటన అద్భుతం… అన్నిటికీ మించి మీకు ఎంతో అందమైన మనసుంది.. వివాదరహితుడు మీరు అంటూ ప్రతీ ఒక్కరూ నరేష్ కు సపోర్ట్ ఇస్తున్నారు.