తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే అనారోగ్యంతో మృతి చెందారు. రాజధాని మహానగరం హైదరాబాద్ లోని మల్కాజ్ గిరి నియోజకవర్గం నుండి గత సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున బరిలోకి దిగి గెలుపొందిన సి.కనకారెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ నగరంలోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అయితే మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేగా కనకారెడ్డి చేసిన సేవలను ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తు చేస్తూ కొనియాడారు.
