Home / 18+ / నమ్రత ఫొటోపై బ్యాడ్ కామెంట్ చేసిన నెటిజన్.. నమ్రత ఏమన్నారంటే.?

నమ్రత ఫొటోపై బ్యాడ్ కామెంట్ చేసిన నెటిజన్.. నమ్రత ఏమన్నారంటే.?

మహర్షి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో మహర్షి సినిమా విజయాన్ని ఎంజాయ్‌ చేస్తూ మహేష్‌ బాబు- డైరెక్టర్‌ వంశీ కుటుంబాలు పార్టీ చేసుకున్నాయి. దీనికి సంబంధించిన ఫొటోలను మహేష్‌ బాబు భార్య నమ్రతా శిరోద్కర్‌ ట్విట్టర్ లో మీడియాలో షేర్‌ చేశారు. సూపర్‌ డూపర్‌ సక్సెస్‌ఫుల్‌ మూవీ మహర్షి. ఇంతటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన వంశీ పైడిపల్లికి ధన్యవాదాలు. వాట్‌ ఏ నైట్‌ అంటూ ఓ ఫొటో పోస్ట్‌ చేశారు. దీంతో ఓ నెటిజన్‌ మాత్రం ఈ ఫొటోల్లో నమ్రత లుక్‌ పట్ల అభ్యంతరం వ్యక్తం చేశాడు. నమ్రత నువ్వెందుకు కొంచెం అయినా మేకప్‌ వేసుకోవు. ఏదైనా ఫోబియాతో బాధ పడుతున్నావా లేదా డిప్రెషన్‌లో ఉన్నావా అని ట్రోల్‌ చేశాడు.

ఇందుకు స్పందనగా నమ్రత మేకప్‌ వేసుకున్న మహిళలనే నువ్వు ప్రేమిస్తావనుకుంటా. ఇకనుంచి ఆ ఆలోచనాసరళికి సరిపోయే వాళ్లను ఫాలో అవ్వు.. అప్పుడే ఇలాంటివి చూడకుండా ఉండగలవు.! కాబట్టి ఇక్కడి నుంచి నువ్వు వెళ్లిపో ఇది నా సిన్సియర్‌ రిక్వెస్ట్‌.. అంటూ కౌంటర్‌ ఇచ్చారు. దీంతో అందం మనసుకే తప్ప శరీరానికి కాదు. మహేష్‌ ఇప్పటికీ 25 ఏళ్ల యువకుడిలా కనిపించడం వెనుక మీ శ్రమ ఉంది. మీ పిల్లల పెంపకంలో మీ పాత్ర అమోఘం. మేకప్‌ వేసుకున్నంత మాత్రాన అందంగా ఉన్నారనడం అవివేకం. అతడికి మంచి కౌంటర్‌ ఇచ్చారు మేడమ్‌ అంటూ నెటిజన్లు నమ్రతపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా 1993లో మిస్‌ ఇండియా కిరీటం దక్కించుకున్న విషయం తెలిసిందే.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat