నిన్న విశాఖ వేదికగా క్వాలిఫయర్2 చెన్నై,ఢిల్లీ మధ్య జరిగిన విషయం అందరికి తెలిసిందే.ఎంతో ఆశక్తికరంగా జరిగిన ఈ మ్యాచ్ లో చివరకు పైచేయి మాత్రం చెన్నై దే.ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న ధోని తన తెలివితేటలతో ఢిల్లీ ఆటగాళ్ళను బురిడి కొట్టించాడు.ఢిల్లీ వికెట్ కీపర్ రిసభ్ పంత్ కాసేపు నిలబడిన చివరకు నిరాశే మిగిలింది.దీని ఫలితమే 20ఓవర్స్ కు 147పరుగులు మాత్రమే చేసారు.ఇక ఆ తరువాత వచ్చిన చెన్నై ఓపెనర్స్ అద్భుతమైన బ్యాటింగ్ తో ఢిల్లీ ఆశలపై నీళ్ళు జల్లారు.ఫైనల్ హైదరాబాద్ లో జరగనుంది.ఈ ఫైనల్ తో కలిపి చెన్నై ఇప్పటివరకూ 8సార్లు ఫైనల్ చేరారు.ఆదివారం జరగబోయే ఫైనల్ లో మరి ముంబై నా,చెన్నై నా అనేది రేపటివరకు వేచి ఉండాల్సిందే.