టీమ్ ఇండియా సీనియర్ మాజీ ఆటగాడు,ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న వెటర్నర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్‌సింగ్ అరుదైన ఘనత సాధించాడు.ఈ ఏడాది ఐపీల్ సీజన్ లో సీఎస్కే తరపున ఆడుతున్న సంగతి తెల్సిందే. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చరిత్రలో 150 వికెట్లు తీసిన మూడో టీమ్ ఇండియా బౌలర్‌గా భజ్జీ నిలిచాడు.ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన సెకండ్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో భజ్జీ ఈ అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నాడు.
మొత్తం 150కి పైగా వికెట్లు తీసిన టీమ్ ఇండియా బౌలర్లలో అమిత్ మిశ్రా(ఢిల్లీ), పియూశ్ చావ్లా(కోల్‌కతా) ఉన్నారు.అయితే,అమిత్ మిశ్రా 147 మ్యాచ్‌ల్లో 157 వికెట్ల ఘనత సాధించాడు. పీయుష్ చావ్లా 157 మ్యాచ్‌ల్లో 150 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు ఢిల్లీతో జరగనున్న మ్యాచ్‌కు ముందు 148 వికెట్లతో ఉన్న భజ్జీ ఢిల్లీ ఓపెనర్ శిఖర్ ధావన్, రూథర్‌ఫర్డ్‌ను ఔట్ చేసి 150మార్కును సాధించాడు.