రెండోరోజు కూడా టీవీ9 కార్యాలయంలో సైబర్ క్రైమ్ పోలీసుల సోదాలు కొనసాగుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో టీవీ9 కార్యాలయం వద్ద శుక్రవారం ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. టీవీ9 కార్యలయం ముందుకు కవరేజ్‌కు వెళ్లిన ‘సాక్షి’ మీడియా ప్రతినిధిపై రవిప్రకాశ్ అనుచరులు గొడవకి దిగినట్లు ఆ చానెళ్లు తెలిపింది. బంజారహీల్స్ లోని టీవీ9 కార్యలయం ముందు గేటు బయట నుంచే మీడియా వాళ్లు చిత్రీకరించే ప్రయత్నం చేస్తుండగా, వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ’సాక్షి’ రిపోర్టరుతో రవిప్రకాశ్ అనుచరులు దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తుంది. కెమెరాను లాక్కునేకు ప్రయత్నం చేశారని తెలిపారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. టీవీ9 కార్యాలయం వద్ద మిగతా చానల్స్ ప్రతినిధులు ఉన్నప్పటికీ…కేవలం సాక్షి మీడియా ప్రతినిధినే వాళ్లు టార్గెట్ చేశారంటే ఏం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు . అంతేకాదు రోడ్డు అడ్డంగా ఉన్నారని, తమకు ఇబ్బంది కలిగిస్తున్నారంటూ దౌర్జన్యానికి దిగారు. లైవ్ కవరేజ్ చేస్తున్న ఆ చానెళ్లకు సంభందించిన డీఎస్‌ఎన్జీ వాహనం వైర్లు పీకేశారు.