టీవీ 9 సీఈవో రవిప్రకాష్ పై తాజాగా అలందా మీడియా ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా తెలుగురాష్ట్రాల్లో సంచలనం రేగింది. సినీ నటుడు శివాజీతో కలిసి కుట్ర పూరితమైన చర్యలకు పాల్పడి ఏబీసీఎల్ యాజమాన్యానికి, కంపెనీకి నష్టం కలిగించే చర్యలకు పాల్పడడంతో పాటు సంస్థకు సంబంధించిన కీలక వ్యక్తి సంతకాన్ని ఫోర్జరీ చేయడం పట్ల ఆయనపై పోలీసు కేసు నమోదు చేసారు. రెండోరోజు కూడా టీవీ9 కార్యాలయంలో సైబర్ క్రైమ్ పోలీసుల సోదాలు కొనసాగుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ శుక్రవారం ఉదయం 11 గంటలకు అత్యవసరంగా సమావేశం కానుంది. తాజా పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించనుంది. అలాగే సీఈవో తొలగింపు, కొత్త సీఈవో నియామకంపై బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చర‍్చించనున్నట్లు తెలుస్తోంది. టీవీ9 వాటాల వ్యవహారంలో రవిప్రకాశ్, సినీ నటుడు శివాజీలపై సైబర్‌క్రైం పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఇటీవల టీవీ9లో మెజారిటీ వాటాలు కొనుగోలు చేసిన అలందా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ డైరెక్టర్ పి.కౌశిక్‌రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్‌క్రైం పోలీసులు ఐటీ యాక్ట్ 66,72 సెక్షన్లతోపాటు ఐపీసీ 406, 420, 467, 469 ,471, 120(బీ) సెక్షన్లపై కేసు నమోదు చేసి నిన్నటి నుంచి విచారణ జరుపుతోంది
Tags hyderbaad police cas raviprakash tv9 ceo