తెలుగు సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ (సినిమా పాత్రల ఆఫర్లను ఎరవేసి అమ్మాయిలను లొంగదీసుకోవడం) ఒక అలవాటు అయితే టాలెంట్ ఉన్నవారిని చాన్స్ ఇస్తామని చెప్పి పడక సుఖం అడగడం మరింత ఎక్కువగా పెరిపోతున్నాయి. సినిమాల్లో చాన్స్ ఇస్తామని చెప్పి అడ్డంగా శీలాన్ని దోచుకోవాలనుకుంటున్న కామాంధులు ఎక్కువైపోయారని బాధితుల కధలు వింటే తెలుస్తోంది. అందరూ కాదు కానీ కొంతమంది మాత్రం టూ మచ్ గా బిహేవ్ చేస్తున్నారని నిన్నటి నటి సమీరారెడ్డి, ఇపుడు మరో సినీ సెలిబ్రిటీ చెబుతున్న మాటలు వింటే ఏంటి, ఎందుకు ఇలా చేస్తున్నారు అనిపిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సింగర్ ప్రణతి ఆచార్య కధ వింటే నిజంగా ఇంత నీచమా అనిపిస్తుంది. తనకు లైంగిక వేధింపులు ఎక్కువ అయ్యాయని చెప్పుకొచ్చింది.ఓ సినీ దర్శకుడు తన సినిమాలో పాట పాడాలలంటే ఓ నైట్ తన పక్కలో పడుకోవాలని చాలా నీచంగా మాట్లాడట. ఆ వేంటనే చెప్పుతో కొడతానంటూ తాను చెప్పి బయటకు వచ్చేశానని ప్రణతి తెలిపింది. తనకు అవకాశం ఇస్తానని తానే ఆ దర్శకుడు పిలిపించుకుని మరీ ఇలా చేయడం ఏంటని ప్రణతి ఆవేదన వ్యక్తం చేసింది. తాను అప్పట్లో ఇంటర్ చదువుతున్నానని, ఆ డైరెక్టర్ పెళ్ళి అయినవాడని, ఇలా వయసులో ఎంతో పెద్ద అయినా కూడా అసభ్యంగా ప్రవర్తించాడని ప్రణతి కళ్ళ నీళ్ల పర్యంతమైంది.
