రాష్ట్ర రాజకీయాల్లో ఎంపీ రాయపాటి సాంబశివరావు కుటుంబానికి గుర్తింపుంది. రాయపాటి అడుగుజాడల్లో ఆయన సోదరుడు శ్రీనివాస్ ఇప్పటివరకూ నడిచారు. తొలినుంచి కాంగ్రెస్‌లో ఉన్న రాయపాటి కుటుంబం 2014ఎన్నికల్లో టీడీపీలో చేరింది. రాయపాటి ఆరుసార్లు ఎంపీగా పనిచేయగా శ్రీనివాస్ ఎమ్మెల్సీగా, గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్‌గా పని చేశారు. రాయపాటి సోదరులు తర్వాత వారి వారసులుగా మోహన్‌సాయి కృష్ణ, రంగబాబు రాజకీయాల్లోకి వచ్చారు. తాజాగా ఎన్నికల ముగిసిన తర్వాత గుంటూరు రాజకీయం మళ్లీ ఒకసారి ఘాటెక్కింది. సాంబశివరావు సోదరుడు శ్రీనివాస్ కుమారుడు మోహన్‌సాయి కృష్ణ చేసిన వ్యాఖ్యలు టీడీపీలో దుమారం రేపుతున్నాయి.
ఏకంగా ముఖ్యమంత్ర చంద్రబాబునే టార్గెట్ చేస్తూ మోహన్ చేసిన వ్యాఖ్యలు చూసి టీడీపీ షాకయ్యింది. హోదా రాకపోవడానికి చంద్రబాబే కారణమంటూ మోహన్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ కోణం ఉన్నట్టుగా తెలుస్తోంది. చంద్రబాబు గతంలో దేశంలో హోదా ఉన్న రాష్ట్రాల్లో అభివృద్ధి జరగలేదని ప్రచారం చేశారని మోహన్ గుర్తు చేసారు. ఏపీకి అసలు హోదా రాకపోవడానికి ప్రధమ ముద్దాయి కాంగ్రెస్ అయితే రెండో ముద్దాయి కచ్చితంగా చంద్రబాబు, మూడో ముద్దాయి పవన్ కళ్యాణే అంటూ ఆయన మండిపడ్డారు. అక్కడితో ఆగకుండా తాను ఏ పార్టీతో సంబంధం లేకుండా ప్రజా సమస్యలపై గళం ఎత్తుతానంటున్నారు. ఎన్నికల ఫలితాలు రాకముందే చంద్రబాబును టార్గెట్ చేయడంపై జిల్లాలో తెలుగు తమ్ముళ్ల తెగ చర్చించుకుంటున్నారు.
రాయపాటి శ్రీనివాస్ కుటుంబం టీడీపీకి గుడ్ బై చెబుతుందని ఇప్పటికే డిసైడ్ అయిపోయారు. మొదటి నుంచి కాంగ్రెస్‌లో ఉన్న రాయపాటి కుటుంబం.. 2014 ఎన్నికల సమయంలో టీడీపీలో చేరింది. శ్రీనివాస్ ఎమ్మెల్సీగా, గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేశారు. రాయపాటి సోదరులు తర్వాత వారి వారసులుగా మోహన్‌సాయి కృష్ణ, రంగబాబు కూడా రాజకీయాల్లోకి వచ్చారు. మరి త్వరలో రాయపాటి శ్రీనివాస్, మోహన్ సాయికృష్ణలు తమ రాజకీయ పయనాన్ని వైసీపీలో కొనసాగించాలనుకుంటున్నట్టు మాత్రం స్పష్టమవుతోంది.