రెండోరోజు అంటే శుక్రవారం కూడా టీవీ9 కార్యాలయంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల సోదాలు కొనసాగుతున్నాయి. సీఈఓ పదవి నుంచి తొలగించామని టీవీ9 యాజమాన్యం ప్రకటించాక కూడా గురువారం సాయంత్రం టీవీ9 తెరపై రవిప్రకాశ్ కనిపించారు. తనపై తప్పుడు వార్తలు వస్తున్నాయని, తాము సమాజం కోసమే పనిచేస్తున్నామని చెప్పారు. కానీ ఫోర్జరీ ఆరోపణలపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ముఖ్యంగా రవిప్రకాష్ అనుచరులు మాత్రం టీవీ9లో ఇంకా ఉన్నారని స్పష్టంగా అర్ధమవుతోంది. ఈ నేపధ్యంలో టీవీ9 బయట వార్త కవరేజీ చేస్తున్న సాక్షి మీడియాపై రవిప్రకాష్ టీం దాడికి పాల్పడింది. లైవ్ లో ఉన్న సాక్షి రిపోర్టర్ పై భౌతిక దాడికి కూడా తెగబడడంతో వాగ్వాదం చోటు చేసుకుంది.