వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా టీవీ9 సీఈఓ రవి ప్రకాశ్ పై ధ్వజమెత్తారు.రవి ప్రకాశ్ లాంటి కొందరు చీడ పురుగుల వల్లే తెలుగు మీడియా ప్రతిష్ఠ మసకబారిందని వీళ్ల బారి నుంచి మీడియా బయట పడితే మళ్లీ 1980 ల ముందు నాటి విశ్వసనీయత వస్తుందని అన్నారు. దేశంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమించిన మీడియా ఆ తర్వాత బ్లాక్ మెయిలర్లు,కుల పిచ్చగాండ్ల చేతికి వెళ్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.ఎట్టకేలకు రవిప్రకాష్ బండారం బయట పడిందని.ఇప్పుడు బాధితులైన ఒక్కొకరు బయటకు వస్తారని అన్నారు.‘కమ్మ’ని నీతులకు కాలం చెల్లింది. చంద్రబాబు ప్రయోగించిన తుప్పు పట్టిన మిస్సైళ్లలో రవిప్రకాష్ ఒకడని చెప్పుకొచ్చారు.రవి ప్రకాష్ కార్పోరేట్ల విబేధాల నుంచి భార్య భర్తల గొడవల వరకు టివీ స్ర్కీన్ పైకి ఎక్కించి సమాజాన్ని భ్రష్టు పట్టించాడని,ఆయన చేయని దుర్మార్గాలు లేవని అన్నారు.
మెరుగైన సమాజాన్ని అడ్డుకున్న ద్రోహి రవిప్రకాష్ బండారం ఎట్టకేలకు బయట పడింది. ఈయన బాధితులు ఒక్కొక్కరు ఇప్పుడు బయటకొస్తున్నారు. ‘కమ్మ’ని నీతులకు కాలం చెల్లింది. చంద్రబాబు ప్రయోగించిన తుప్పు పట్టిన మిస్సైళ్లలో రవిప్రకాష్ ఒకడు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) May 9, 2019
‘మెరుగైన సమాజం కోసం’ పరివర్తన తీసుకుచ్చే ప్రవక్తలాగా చెలరేగిన రవి ప్రకాష్ చేయని దుర్మార్గాలు లేవు. మతాలను కించపర్చడం, కార్పోరేట్ల విబేధాల నుంచి భార్య భర్తల గొడవల వరకు టివీ స్ర్కీన్ పైకి ఎక్కించి సమాజాన్ని భ్రష్టు పట్టించాడు. కులం లేదంటూనే గజ్జిని వ్యాప్తి చేశాడు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) May 9, 2019