“10 వేల కోట్ల లోటు సంక్షోభంలో విద్యుత్ రంగం” అని ఈ రోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురించిన కథనాలపై ట్రాన్స్ కో,జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు స్పందించారు. ఆంధ్రజ్యోతి పత్రిక ప్రచురించిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదని అన్నారు. రాష్ట్రంలో కూడా విద్యుత్ సమస్య లేదని స్పష్టం చేశారు.ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యుత్ సంస్థల్లో అనేక సంస్కరణలు తీసుకు వచ్చామని తెలిపారు. తప్పుడు వార్తలతో ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నాణ్యమైన విద్యుత్ రాక మోటర్లు కాలిపోయాయని కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని అన్నారు. అలాగే తాను విద్యుత్ సంస్థల నుంచి తప్పుకున్నట్లు వార్తలు ప్రచురించారని ఇందులో ఏ మాత్రం నిజం లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని కేసీఆర్ నిర్ణయం మేరకు నడుచుకుంటానని చెప్పారు తన అనుమతి లేకుండా లాంటి వార్తలు ప్రచురించడం సరికాదని హెచ్చరించారు