తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తమిళనాడు రాష్ట్రంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ కేసీఆర్ కుటుంబ సభ్యులు రామేశ్వరంలో రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వీరికి ఆలయ పూజారులు, సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ తదితరులు ఉన్నారు.
