నేడు విశాఖ వేదికగా చెన్నై, ఢిల్లీ మధ్య భీకర పోరు జరగనుంది.ఇందులో గెలిచినవారు ఆదివారం ముంబై ఇండియన్స్ తో ఫైనల్ ఆడతారు.అయితే ఢిల్లీ కేపిటల్స్ జట్టు మంచి ఆటతో ఇక్కడివరకు వచ్చింది.ఇక గత ఏడాది ఛాంపియన్స్ ఐన చెన్నై సూపర్ కింగ్స్ లీగ్ మ్యాచ్ లలో మంచి ఆట కనబరిచిన చివరి మూడు మ్యాచ్లో కూడా ఓటమి చవిచూసింది.ప్రస్తుతం అందరి చూపు ఢిల్లీపైనే ఉంది ఎందుకంటే ఇప్పటివరకూ ఈ జట్టు ఇప్పుడు ఫైనల్ కు రాలేదు.చెన్నై, ముంబై మాత్రం మూడు టైటిల్స్ సాధించారు.మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో తెలుసుకోవాలంటే మరికొన్ని గంటలు వేచి ఉండాల్సిందే.ఒకవేళ చెన్నై గెలిస్తే నాలుగో టైటిల్ కోసం ఇరు జట్లు పోటీ పడతాయి.
