పదో తరగతి పరీక్ష ఫలితాలు మే 13వ తేదీన విడుదల కానున్నాయి. ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఓ లేఖను విడుదల చేసింది. మే 13 సోమవారం రోజున ఉదయం 11.30 నిమిషాలకు సెక్రటేరియట్, డి బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ కాన్ఫరెన్స్ హాల్ లో పదో తరగతి పరీక్ష ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ అధికారులు విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలను www.bse.telangana.gov.in, www.results.cgg.gov.in అధికారిక వెబ్ సైట్లలో చూడొచ్చని గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ డైరెక్టరేట్ కార్యాలయం ప్రకటించింది.
