టీవీ 9 సీఈవో రవిప్రకాష్ పై తాజాగా అలందా మీడియా ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా తెలుగురాష్ట్రాల్లో సంచలనం రేగింది. సినీ నటుడు శివాజీతో కలిసి కుట్ర పూరితమైన చర్యలకు పాల్పడి ఏబీసీఎల్ యాజమాన్యానికి, కంపెనీకి నష్టం కలిగించే చర్యలకు పాల్పడడంతో పాటు సంస్థకు సంబంధించిన కీలక వ్యక్తి సంతకాన్ని ఫోర్జరీ చేయడం పట్ల ఆయనపై పోలీసు కేసు నమోదు చేసారు. ఈ ఘటనలో రవిప్రకాష్ పరారీలో ఉన్నాడు. అయితే వైసీపీలో దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. తెలుగుదేశం మద్దతుదారుల పాపం పండిందని ఒక్కొక్కరి అక్రమాలు బయటకు వస్తున్నాయని చెప్తున్నారు. 2010 నుంచి 2013 మధ్యలో మూడు బ్యాంకులకు – సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్- చెన్నై లోని బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ లిమిటెడ్ రూ. 364 కోట్ల నష్టం చేకూర్చారని, మనీ లాండరింగ్ కు పాల్పడిన అభియోగాలున్నాయి. అలాగే తాజాగా జరిగిన ఎన్నికల్లో టీడీపీ నేత, జయభేరి గ్రూపు సంస్థల ఛైర్మన్ మాగంటి మురళీ మోహన్ పై కేసులు నమోదయ్యాయి. భారత శిక్ష్యాస్మృతిలోని 171బీ, 171ఈ, సీ, ఎఫ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జన్నార్ వెల్లడించారు. అక్రమంగా తరలిస్తున్న కోట్లాదిరూపాయలను పట్టుకున్నారు. అలాగే సీఎం రమేష్ కు సంబంధించిన రిత్విక్ కనస్ట్రక్షన్ కంపెనీ కూడా అనేక కోట్లాది రూపాయల అక్రమాలకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఒక్కొక్కరిగా తెలుగుదేశం మద్దతుదారుల అక్రమాలు బయటపడుతుండడంతో వైసీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతలు అంటే పరోక్షంగా రవిప్రకాష్ కూడా చంద్రబాబుకు అత్యంత సహచరుడు కాబట్టి ఈయనను కూడా టీడీపీ మద్దతుదారుడిగానే పరిగణిస్తున్నారు. దీంతో రవిప్రకాష్ తర్వాత చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా ఉండే ఓ మీడియాధినేత బండారం బయటపడుతుందంటూ పోస్టులు పెడుతున్నారు. రవిప్రకాష్ కాస్తో కూస్తో సొంతంగా సంపాదించుకుని టాలెంట్ తో ఎదిగారని సదరు వ్యక్తి మాత్రం దారుణమైన పనులు చేయడం, ఇల్లీగల్ వ్యవహారాలు చేస్తూ బ్లాక్ లో పలు వస్తువులు అమ్మడం, కులపిచ్చితో మీడియాను నడపడం వంటివి చేసారని, గతంలో ఇద్దరు బాలికల ఆరోగ్యానికి చికిత్స చేయిస్తానని నమ్మబటికి మీడియా ద్వారా పోగుచేసిన కోట్లాది రూపాయలు కాజేసారనే ఆరోపణలు ఉన్నాయి. తాజా ఘటనలతో నెక్స్ట్ అతనేనంటూ సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు వైరల్ గా మారుతున్నాయి.
Tags hyderbaad media tdp tv9 raviprakash
Related Articles
నువ్వు హీరోవా….రౌడీవా…బొచ్చులోది…గెటవుట్…బాలయ్యపై టాలీవుడ్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..!
September 23, 2023
.జైలు నుంచే బాలయ్యకు చంద్రబాబు వెన్నుపోటు..బ్రాహ్మణి భజన చేస్తున్న పచ్చ సాంబడు..!
September 23, 2023
జడ్జి హిమబిందుపై టీడీపీ నేతల కారుకూతలపై రాష్ట్రపతి భవన్ సీరియస్..కఠిన చర్యలకు ఆదేశాలు..!
September 23, 2023
నీ బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు అయితే మాకేంటీ..ఇక్కడ ఉన్నది కాపు బిడ్డ..జాగ్రత్త బాలయ్య..!
September 21, 2023
వైఎస్సార్సీపీ గుర్తు అయినంత మాత్రాన జైలులో ఫ్యాన్ వాడకుంటే దోమలు కుట్టవా బాబుగారు..!
September 21, 2023
చంద్రబాబు జైలుకు వెళితే..టాలీవుడ్‌కేం సంబంధం..”కమ్మ”గా కళ్లు తెరిపించిన సురేష్ బాబు..!
September 19, 2023
హైదరాబాద్‌లో టీడీపీ కమ్మోళ్లే కాదు..జగన్ ఫ్యాన్స్ కూడా ఉన్నారబ్బా..దెబ్బకు దెబ్బ అంటే ఇదే..!
September 19, 2023
జగన్ కేసీఆర్‌లపై ప్రశంసలు..పవన్, బాబుకి అక్షింతలు..మంట పుట్టిస్తున్న జేడీ ట్వీట్స్..!
September 16, 2023
చంద్రబాబుకు మళ్లీ షాక్ ఇచ్చిన ఏసీబీ కోర్డ్..రెండు బెయిల్ పిటీషన్లు కూడా వాయిదా..!
September 15, 2023
జూనియర్ ఎన్టీఆరా..వాడో ఓ పిల్ల సైకో…కులపోళ్లతో తిట్టిస్తున్న పచ్చమీడియా..ఇది నారా కుట్ర..!
September 15, 2023
ఏఏజీ పొన్నవోలుని చెప్పుతో కొట్టిస్తా..నా కొడకా..అని తిట్టించిన టీవీ 5 పచ్చ సాంబడు..!
September 15, 2023