ప్రముఖ టీవీ న్యూస్ ఛానెల్ ” టీవీ9 ” సీఈవో రవిప్రకాశ్ పై ఫోర్జరీ కేసు నమోదైంది. రవిప్రకాష్ ను టీవీ9 సీఈఓ పదవి నుంచి తొలగిస్తూ ఆ సంస్థ యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. రవిప్రకాష్ పోర్జరీ సంతకాలతో మోసానికి పాల్పడ్డారని గుర్తించిన యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే పలు ఆరోపణలు ఎదుర్కుంటున్న రవిప్రకాష్ ను సంస్థ తొలగించింది. టీవీ9లో 90 శాతం వాటాను అలంద మీడియా సంస్థ కొనుగోలు చేసినా యాజమాన్య మార్పును అడ్డుకునేందుకు నటుడు శివాజీతో కలిసి రవిప్రకాష్ నటకాలు అడుతున్నారని సంస్థ గుర్తించింది. ఈ రోజు టీవీ9 కార్యాలయంలోనూ, రవిప్రకాశ్ ఇంటి లోనూ హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు.