నిధుల మళ్లింపు, ఫోర్జరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఈవో రవిప్రకాశ్ ను టీవీ9 నుండి తొలగించారు. ఆయనను సీఈవో బాధ్యతల నుంచి యాజమాన్యం తప్పించింది. సంస్థ నిర్వహణలో వైఫల్యంతో పాటు, కీలక ఉద్యోగి సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఆరోపణల నేపథ్యంలో టీవీ9 ఈనిర్ణయం తీసుకుంది. కాగా అసోసియేట్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, సీఈవో రవిప్రకాశ్‌కు కేవలం 8శాతం వాటా మాత్రమే ఉన్నప్పటికీ నూతన యాజమాన్యానికి సహకరించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. తన నిర్ణయాలే చెల్లుబాటు అయ్యేలా ఒత్తిడి తేవడంతో పాటు, టీవీ9 తన ఆధ్వర్యంలోనే నడవాలని షరతులు పెట్టినట్లు తెలుస్తోంది.
కాగా టీవీ9లో మెజారిటీ వాటా కలిగిన శ్రీనిరాజు తన వాటాలను అలంద మీడియాకు విక్రయించిన విషయం విదితమే. ఈ ఘటనలోనే రవిప్రకాష్ పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే తాజా ఘటనలతో సీనియర్ జర్నిలిస్టులు గతంలో రవిప్రకాష్ బాధితులు ఇప్పుడు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ జర్నలిస్టులతో కాళ్లు పట్టించుకున్న పాపం ఇలా పండిందంటూ విమర్శిస్తున్నారు.