గత ఆదివారం ఐపీఎల్లో భాగంగా చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. వరుసగా నాలుగు మ్యాచ్‌లలో ఓటమి తర్వాత తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ విజయం సాధించడంపై కింగ్స్ పంజాబ్ యజమాని ప్రీతిజింటా ఆనందం వ్యక్తం చేశారు. అయితే మ్యాచ్ అనంతరం ధోనితో కరచాలనం చేశారు. ఇక్కడే ఇంకోక విషయం జరిగింది. ఎంఎస్ ధోనికి వార్నింగ్ ఇచ్చారు. ఎక్కడ అనుకున్నారా..అదేనండి ట్వీట్టర్ లో..ఏం జరిగిందో మీరే చూడండి.. “కెప్టెన్ కూల్‌కి చాలామంది అభిమానులు ఉన్నారు. వారిలో నేనొకరిని. అయితే, ఈ మధ్య కాలంలో నేను ధోనితో పాటు ఆయన కూతురు జీవాకు కూడా ఫ్యాన్‌ని అయ్యా. నా దృష్టి ఆమెపై పడింది. జీవా విషయంలో జాగ్రత్తగా ఉండమని ధోనీని హెచ్చరిస్తున్నా. ఆమెను కిడ్నాప్ చేయాలనుకుంటున్నాను” అని ట్విటర్లో సరదా వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వాఖ్యలు సోషల్ మీడియలో హల్ చల్ చేస్తున్నాయి.
Captain cool has many fans including me, but off-late my loyalties are shifting to his little munchkin Ziva. Here I’m telling him to be careful – I may just kidnap her ? Now it's time for you guys to Caption THIS photo…#Ting pic.twitter.com/bD1ADSXopc
— Preity G Zinta (@realpreityzinta) May 7, 2019