ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ టీవీ9 సీఈఓ రవిప్రకాష్ పై ఫోర్జరీ కేసు నమోదు అయింది. అయితే తన సంతకాన్ని రవి ప్రకాష్ ఫోర్జరీ చేసి కొత్త డైరెక్టర్ల నియామకానికి అడ్డు తగులుతున్నాడని అలంద మీడియా సంస్థ కార్యదర్శి కౌశిక్ రావు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేశారు. అయితే కొద్ది రోజుల కిందటనే టీవీ9ను అలంద మీడియా టేకోవర్ చేసిన సంగతి తెల్సిందే. తాజాగా కౌశిక్ రావు ఇచ్చిన పిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు రవి ప్రకాష్ ఇంటిలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే పోలీసులు వెళ్ళేసరికి రవిప్రకాష్ ఇంట్లోలేడని వార్తలు వస్తున్నాయి.
Tags alanda media andhrapradesh cyber crime polices dharuvu News ravi prakash slider telangana tv9