టీవీ9 సీఈఓ రవిప్రకాష్ వ్యవహారంలో నటుడు శివాజీ నివాసంలో కూడా పోలీసులు సోదాలు నిర్వహించారు. టీవీ9లో నటుడు శివాజీకి కూడా వాటా ఉన్నట్లు, రవిప్రకాశ్ నుంచి ఆయన ఈ షేర్లు కొన్నట్లు తెలుస్తోంది. టీవీ9ను అలంద మీడియా టేకోవర్ చేసుకున్న అనంతరం ఈ కొనుగోలు ప్రక్రియను సవాల్ చేస్తూ శివాజీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో సవాల్ కూడా చేశాడు. అయితే రవిప్రకాశ్ ప్రోద్బలంతోనే శివాజీ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఆ వార్తలకు ఊతమిస్తూ రవిప్రకాశ్, శివాజీ కలిసి ఉన్న ఓ ఫోటో గత ఏడాది సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అందుకే ఆరునెలలకు ఓసారి ఆపరేషన్ ’గరుడ’ అంటూ హడావుడి చేసే శివాజీకి టీవీ9 ఓ రేంజ్లో హైప్ క్రియేట్ చేసిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శివాజీని కూడా పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ గరుడ పేరుతో శివాజీ ఇప్పటికే పలు కట్టు కధలు పిట్టకధలు చెప్పిన వ్యవహారం వెనుక కూడా కచ్చితంగా రవిప్రకాశ్ ఉన్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఆపరేషన్ గరుడపురాణం విత్ రవిప్రకాశ్ అనే అంశం బట్టబయలు అయ్యింది.