సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ సినిమాగా తెరకెక్కిన సినిమా మహర్షి. మహేష్ కెరీర్‌లో మైల్ స్టోన్ మూవీ కావటంతో దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీ లాంటి బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. మహేష్ ఇమేజ్‌ను మరింత ఎలివేట్ చేసే విధంగా యాక్షన్, ఎమోషన్, కామెడీ, మెసేజ్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా కథను రెడీ చేశాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. అభిమానుల్లో కూడా మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైయ్యింది. ఓవర్సీస్‌లో పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని థియేటర్లలో బెన్‌ఫిట్ షోలు ప్రదర్శితమయ్యాయి. సినిమా ఫస్టాప్ అంతా కాలేజ్ స్టూడెంట్‌గా మహేష్ జర్నీ సరదాగా సాగిపోయిందని, సెకండాఫ్ ఎమోషన్‌తో మెప్పించాడని సినిమా చూసిన అభిమానులు చెబుతున్నారు . అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడ సినిమా చాలా బాగుంది చివరి 45 సినిమాలు సూపర్ హిట్ అంటున్నారు. అంతేకాదు సినిమా భారీగా కలెక్షన్స్ సాధించే అవకాశం ఉందనేది అంచనా వేస్తున్నారు. ‘మహర్షి’సినిమా థియోటర్ల ముందు ప్రేక్షకుల మాటలు ఈ క్రింది వీడియో చూడండి.
