సాయిపల్లవి… భానుమతి ఇక్కడ.. సింగిల్ పీస్.. హైబ్రీడ్ పిల్ల.. అంటూ ఫిదా సినిమాతో తెలుగు కుర్రకారుకు చేరువయ్యింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ హిట్ అవ్వడంతో తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది.. మలయాళంలో మల్లర్‌గా, తెలుగులో భానుమతిగా, తమిళంలో రౌడి బేబిగా ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చిత్రంలో వరుణ్ తేజ్ తో కలిసి ‘వచ్చిందే పిల్లా మెల్లగా వచ్చిందే’ అనే పాటకు తాను వేసిన డాన్స్ తో అందరిని ఆకట్టుకుంది.ఈ పాట ఇప్పుడు యుట్యూబ్ లో రికార్డు కూడా బ్రేక్ చేసింది.200మిలియన్ వ్యూస్ ఈ వీడియోకి వచ్చాయి.అంటే అక్షరాల సాయిపల్లవి సాంగ్ 20కోట్ల మంది చూసారు.దీంతో ఆదిత్య మ్యూజిక్ వారు స్వయంగా ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది.
