సూపర్ స్టార్ మహేష్,పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం మహర్షి.ఈ సినిమా రేపు అనగా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఫాన్స్ కూడా సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.అయితే ఫాన్స్ తో పోటీ పడుతూ అంతకన్నా ఎక్కువగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు విజయ్ దేవరకొండ.ఎలాగైనా ఈ సినిమా హిట్ అవుతుందని అంటున్నాడు. ఎందుకంటే రేపు సినిమా ఒక్కటే కాదు…విజయ్ దేవరకొండ పుట్టినరోజు కూడా.మొన్న మహర్షి ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగిన విషయం అందరికి తెలిసిందే.ఇందులో ముఖ్య అతిధులుగా వెంకటేష్, విజయ్ వచ్చారు.విజయ్ దేవరకొండ మాట్లాడుతూ సినిమా రిలీజ్ రోజునే నా పుట్టినరోజు సినిమా సూపర్ హిట్ అని చెప్పాడు.ఇది మహేష్ కి నేను ఇచ్చే స్పెషల్ గిఫ్ట్ అని అన్నాడు.