ఆంధఫ్రదేశ్‌లో 2019 ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. ప్రస్తుత అధికార పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండగా జగన్ గెలుపు నల్లేరుపై నడకలా మారింది. ఇటు టీడీపీ, మరోవైపు వైఎస్సార్‌సీపీ ఇరు పార్టీలు గెలుపుపై ధీమాతో ఉండగా.. ఇటీవలి విడుదలైన సర్వేలన్నీ వైఎస్సార్‌సీపీవైపే మొగ్గుచూపడం విశేషం. ఓటమి భయంతో చంద్రబాబు ఢిల్లీ చుట్టు చక్కర్లు కొడుతుండగా మరోవైపు గెలుపుపై ధీమాతో ప్రశాంతంగా ఉన్న జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారని సమాచారం.
జగన్ ముఖ్యమంత్రి అవగానే ముందుగా ఏం చేస్తారు.?
అమరావతి నుంచి రాజధానిని తరలిస్తారా..?
చంద్రబాబుపై ఉన్న అవినీతి కేసులన్నీ వెలికితీస్తారా..?
జేసీ దివాకర్ రెడ్డి అన్నట్లుగా టీడీపీనీ భూస్థాపితం చేస్తారా.?
ఇలా అనేక రకాల సందేహాలు ప్రజల్లో ఉండగా… జగన్ మాత్రం ఇందుకు పూర్తి విభిన్నంగా ఆలోచిస్తున్నారు. ముందుగా ప్రజా సమస్యలపై దృష్టిసారిస్తూ.. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తక్షణమే తీసుకోల్సిన నిర్ణయాలపై ఇప్పటినుంచే సన్నద్ధమవుతున్నారు. వైసీపీ నవరత్నాలపై చిత్తశుద్ధితో ఉన్న జగన్ వాటి అమలు, వాటి పనితీరును స్వయంగా ఆయనే పర్యవేక్షించనున్నారు.ముఖ్యంగా రైతుల పట్ల ప్రత్యేక శ్రద్ధతో ఉన్న జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే 5 ఎకరాలలోపు ఉన్న సన్నకారు, చిన్నకారు రైతులకు, రైతు కుటుంబాలకు 50 వేల రూపాయల ఆర్థికసాయం చేయనున్నారు. వైఎస్సార్ రైతు భరోసా కింద ఎలాంటి బేధాభిప్రాయాలు లేకుండా ప్రతీ రైతుకి భీమా సౌకర్యం. ప్రతీ సంవత్సరం మే నెలలో నేరుగా ప్రతీ రైతులకు చేతిలోకి చేరే విధంగా 12 వేల 500 రూపాయల పంట పెట్టుబడి సాయం చేయనున్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరపై ప్రత్యేక నిధి ఏర్పాటు చేయనున్నారు.
డ్వాక్రా మహిళలకు, పొదుపు సంఘాల అభివృద్ధికి 15 వేల కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధి ఏర్పాటు. వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు 2వేల రూపాయల పెన్షన్, నిరుపేద కుటుంబాల పిల్లల చదువుల కోసం అమ్మ ఒడి పథకం కింద 5వ తరగతిలోపు పిల్లలకు ఒక్కొక్కరికి 5వందల రూపాయలు, 5 నుంచి 10వ తరగతి వరకు చదువుకునే పిల్లలకు 750 రూపాయలు, ఇంటర్ విద్యార్థులకు వెయ్యి రూపాయల చొప్పున నెలనెలా అందజేయడం. మరింత ఉన్నత చదువుల కోసం ఫీజు రియింబర్స్‌మెంట్ వర్తింపజేయడం. ప్రతీ పేద కుటుంబానికి పక్కా ఇళ్ల మంజూరు. వైఎస్సార్ హయాంలో మంచి ప్రజాధరణ పొందిన ఆరోగ్యశ్రీ పథకాన్ని మరిన్ని మార్పుచేర్పులతో తిరిగి పునరుద్ధరించడం. కిడ్నీ తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పేదలకు ప్రత్యేక పెన్షన్. నిరుద్యోగ సమస్యపై ప్రత్యేక దృష్టి.
పోలవరం అన్నీ సాగునీటి ప్రాజెక్ట్‌లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడం. మద్యపాన నిశేధం. మూడు దశల్లో మద్యాన్ని నిశేధించేందుకు రిహాబిలిటేషన్ సెంటర్లు సహా అవసరమైన అన్నీ చర్యలు చేపట్టడమే కాకుండా అందుకు కోసం కొత్త చట్టంతో పాటు ప్రత్యేక యంత్రాగాన్ని సైతం ఏర్పాటు చేయనున్నారు. ఇలా సీఎంగా తన కార్యాచరణను రూపొందించుకుని అన్ని రంగాలకు అన్నీ విధాలుగా పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారు వైసీపీ అధినేత వైఎస్ జగన్.