ఐపీఎల్-12లో మరో సమరానికి సమయం ఆసన్నమయింది.ధోని నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్..రోహిత్ శర్మ నాయకత్వంలో ముంబై ఇండియాన్స్ ఈరోజు క్వాలిఫయర్-1 ఆడనుంది.ఈ మ్యాచ్ కు చెన్నై చిదంబరం స్టేడియం వేదిక కానుంది.ఇక ఈ రెండు జట్ల బల బలాలు చూసుకుంటే..చెన్నై జట్టు గట్టిదనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ సీజన్లో ప్లేఆఫ్స్ కు అర్హత సాధించిన తొలి జట్టు చెన్నైనే.అంతేకాకుండా అంతకముందు ఛాంపియన్ కూడా.ఈ జట్టు సారధి మంచి ఫామ్ లో ఉన్నాడు.బ్యాటింగ్ లో వాట్సన్,డుప్లేసిస్,రైనా ఈరోజు కూడా పుంజుకొని ముంబై బౌలర్స్ ని సమర్దవంతంగా ఎదుర్కుంటే చెన్నై కి ఎదురు లేనట్టే.ఇక చెన్నై బలం అంతా బౌలర్స్ నే.తాహిర్,హర్భజన్,జడేజా టీమ్ కు బలమని చెప్పాలి.
మరోపక్క ముంబై చూసుకుంటే..ఈ జట్టు టాప్ ఆర్డర్ రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్, హార్దిక్ పాండ్య తో గట్టిగా ఉంది.ఇప్పటివరకూ చెన్నైతో ఆడిన రెండు మ్యాచ్ లు ముంబై నే గెలిచింది.ఇందులో ఒకటి చెన్నై పిచ్ లోనే నెగ్గింది.ఇక ముంబై బౌలర్స్ బుమ్రా, మలింగ, పాండ్య సోదరులు, యువ లెగ్‌స్పిన్నర్ రాహుల్ చాహర్‌లతో కూడిన పదునైన బౌలింగ్ ఉంది.లీగ్ దశలో చివరి రెండు మ్యాచ్లో గెలిచి మొదటి ప్లేస్ కి వెళ్ళింది.అయితే ఈ రెండు జట్లు కూడా గట్టివనే చెప్పుకోవాలి .ఇందులో గెలిచినా జట్టు నేరుగా ఫైనల్ కి చేరుకోగా..ఓడిన జట్టుకు ఇంకొక ఛాన్స్ ఉంది.మరి ఈరోజు ఎవరు గెలుస్తారు అనేదానికి కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.