Home / 18+ / ఇంటర్నేషనల్ నర్సస్ డే వేడుకలకు హాజరుకానున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు… నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్

ఇంటర్నేషనల్ నర్సస్ డే వేడుకలకు హాజరుకానున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు… నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్

ప్రజారోగ్యాని కాపాడుతున్న నర్సింగ్ సమాజానికి                                                                                                                        ప్రపంచ నర్సింగ్ వారోత్సవ శుభాకాంక్షలు తెలిపిన
వైద్యఆరోగ్య శాఖ మంత్రి వర్యులు
-ఈటెల రాజేందర్ గారు

ఇంటర్నేషనల్ నర్సస్ డే వేడుకలకు పెద్ద సంఖ్యలో మన నర్సింగ్ ఆఫీసర్స్ హాజరు కావాలి. – శ్రీను రాథోడ్

నర్సింగ్ సమాజం గొంతుకై ముందుకు సాగుతున్న నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ను ఆదరిస్తున్న అందరికి ధన్యవాదాలు తెలిపిన – లక్ష్మణ్ రూడవత్

మే 12 నాడు రవీంద్రభారతి వేదికగా నర్సింగ్ ఆఫీసర్స్ మరియు తెలంగాణ మెడికల్ & హెల్త్ ఎస్సి, ఎష్టి ఎంప్లాయిస్ అసోసియేషన్ & వెల్ టెక్ ఫౌండేషన్,
తెలంగాణ రెండవ ఏనమ్ అసోసియేషన్.
వారి ఆధ్వర్యంలో జరుగనున్న ఇంటర్నేషనల్ నర్సస్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు అవ్వాలి అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులను కోరిన నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనురాథోడ్
మరియు వ్యవస్థాపకుడు లక్ష్మణ్ రూడవత్ మరియు అసోసియేషన్ సభ్యులు మంత్రి అసోసియేషన్ సభ్యులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజారోగ్యాని కాపాడుతున్న నర్సింగ్ సమాజానికి ప్రపంచ నర్సింగ్ వారోత్సవ శుభాకాంక్షలు అని తెలిపారు.
అసోసియేషన్ సభ్యుల విన్నపము మరియు ప్రజారోగ్యాని కాపాడుతున్న నర్సింగ్ సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని నర్సస్ డే వేడులకు ముఖ్య అతిథిగా హాజరుఅయ్యేందుకు అంగికరించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు.

ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీను రాథోడ్ మాట్లాడుతూ ఈ నేల 12 ఆదివారంనాడు జరిగే ఇంటర్నేషనల్ నర్సస్ డే వేడుకలకు పెద్ద సంఖ్యలో మన నర్సింగ్ ఆఫీసర్స్ హాజరువ్వాలి అని ఆయన కోరారు.

లక్ష్మణ్ రూడవత్ మాట్లాడుతూ ప్రజారోగ్యంలో కీలక పాత్ర పోషిస్తున్న మన నర్సింగ్ ఆఫీసర్స్ కి తగ్గిన ప్రోత్సహం మరియు ప్రభుత్వ పరంగా అందవలసిన న్యాయమైన హక్కులు అందెలాగున నర్సింగ్ సమాజం యొక్క గొంతుకై సాగుతున్న నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆదరిస్తున్న అందరికి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా
మే12 నాడు ప్రజారోగ్యంలో ముఖ్యపాత్ర పోషిస్తున్న
నర్సింగ్ ఆఫీసర్స్ గుర్తించి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ నర్సింగ్ ఆఫీసర్స్ అవార్డులను ఆరోగ్య శాఖ మంత్రి వర్యుల చేతులా మీదుగా ప్రధానం చేయడం జరుగుతుంది.
మరియు నర్సింగ్ ఆఫీసర్స్ నిపుణులచే మన పౌరులకు అందరికి ఆరోగ్యం ఏ విధంగా అందించవచ్చో సూచనలు చేయనున్నారు. నర్సింగ్ సమాజంలోని నర్సింగ్ నిరోద్యుగులు ఎదుర్కొంటున్నా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతాము లక్ష్మణ్ రూడవత్ పేర్కొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat