ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్ లో అసేంబ్లీ ఎన్నికలు ఎంత రసవత్తరంగా జరిగాయో మనకు తెలిసిందే. మళ్లీ అధికారం కోసం టీడీపీ. ఈసారి ఖచ్చితంగా గెలవాలని ప్రధాన ప్రతిపక్ష వైసీపీ, ఇంకొ పార్టీ జనసేనా ప్రధానంగా పోటి చేశాయి. ప్రస్తుతం ఏపీలో ప్రతి ఒక్కరు ఎన్నికల ఫలితాల కోసం ఎంతో అత్రూతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎన్నికల ముందు ఎన్నికల తరువాత వచ్చిన సర్వేలన్నింటిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవుతాడని తెలిపాయి. ఈ ఎన్నికల్లో వైఎస్ జగన్ అధికారం లోకి రావాలని ప్రజలు కూడ కోరుకుంటున్నారు. ఈక్రమంలో ప్రసుతం ఫోకస్ మొత్తం గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పైనే ఉంది, మంగళగిరి లో చంద్రబాబు తన తనయుడు నారా లోకేష్ ను వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డిపై పోటి చెయ్యించారు. ఈ నియోజక వర్గంలో లోకేష్ అధిక మెజారిటీ తో గెలుస్తారని భావించారు కానీ లోకేష్ మంగళగిరిలో ఓడిపోవడం ఖాయమని తెలుస్తుంది. చంద్రబాబు మాత్రం టీడీపీ అధికారం లోకి వస్తుందని మళ్లీ ఏపీలో తామే చక్రం తిప్పుతామని లోకేష్ కి త్వరలోనే అధికారాన్ని కట్టబెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే అవన్నీ పగటి కలలాగే చివరికి మిగిలిపోయోలా ఉన్నాయి. ఒకవేళ అన్ని కుదిరి లోకేష్ కి గనుక పార్టీ పగ్గాలు అప్పజెప్పితే అతన్ని పార్టీ లో ఒక్కరంటే ఒక్కరు కూడా లెక్క చెయ్యరని సీనియర్ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో లోకేష్ మరో ఐదేళ్ల పాటు తన తండ్రి వెనకాలే ఉండక తప్పదని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇంకొక విషయం ఏంటి అంటే ఈసారి గనక టీడీపీ ఓడిపోతే ఇక ఎన్నటికీ కూడా గెలవలేదని విశ్లేషకులు గట్టిగా అంటున్నారు. ఇదే ప్రస్తుతం నారా లోకేష్ పరిస్థితి.
