కర్నూల్ జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి తనయుడు, మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఏ పార్టీ అని అడిగితే ఇప్పటికీ టక్కున కాంగ్రెస్ అనే చెప్తారు ఎక్కువ మంది. అంతలా కోట్ల కుటుంబం కాంగ్రెస్ పార్టీతో మమేకమైంది. అందుకే.. కాంగ్రెస్ పార్టీని వీడటం అంటే నేను రాజకీయ సన్యాసం చేసినట్లేనని ఓ సందర్భంలో ఆయన ప్రకటించారు. అంతటి కరుడుగట్టిన కాంగ్రెస్ నాయకుణ్నిచంద్రబాబు నాయుడు టీడీపీలో చేర్చుకున్నారు. 2014 నుండి ఇప్పటికి కర్నూలు జిల్లాలో తిరుగులేకుండా వీస్తున్న వైసీపీ ఫ్యాన్ గాలిని అడ్డుకోవాలనేది బాబు స్కెచ్. అందుకే.. ఎన్నో ఏళ్ల నుండి వైరంగా కేఈ కుటుంబం, కోట్ల కుటుంబాల మధ్య బలవంతంగా రాజీ కుదిర్చారు. రెండు కుటుంబాలు కలిస్తే ఓట్లే ఓట్లు అని చంద్రబాబు లెక్కలేసుకున్నారు. కానీ ప్రజలు 2104లోనే వైసీపీకి అత్యధిక సీట్లతో గెలిపించారు. అప్పటి నుండి ఇప్పటికి వైసీపీ వైపు ప్రజలు ఎన్నారనేది నగ్న సత్యం. అయితే చంద్రబాబు చెప్పాడని కలిసినట్లే కనిపించిన కోట్ల, కేఈ వర్గీయుల మధ్య క్షేత్రస్థాయిలో విద్వేషాలు అలాగే ఉన్నాయి. కోడుమూరులో టీడీపీ నాయకులు కోట్లకు ఏమాత్రం సహకరించలేదనే ఒక టాక్ ఉంది. ఎదురూరు విష్ణువర్దన్ రెడ్డి బహిరంగంగానే కోట్లకు ఓటు వెయ్యకండి అని పిలుపునిచ్చినట్లు చెబుతున్నారు. ఆదోని నియోజకవర్గంలో ఇంతకుముందు కోట్లతోపాటు ఉన్నా కాంగ్రెస్ ముస్లిం మైనార్టీలు అడ్డం తిరిగారు. ఎవరికైనా వెయ్యండి కాని కోట్లకు మాత్రం ఓటెయ్యొద్దంటూ ప్రచారం చేశారు. ఇక కర్నూలు, ఎమ్మిగనూరులో చెప్పక్కర్లేదు. అక్కడంతా వైసీపీనే. ఎన్నికల వరకు గెలుస్తామని ధీమాతో ఉన్నారంట ఇప్పుడు కోట్ల ఫ్యామిలి పూర్తిగా అంతర్మథనంలోకి వెళ్లిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గెలుపు ఆశలు లేవు సరికదా.. ఓటమి భయం నిద్రపోనివ్వడం లేదంట..!
