టీఆర్ఎస్ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కేరళ వెళ్లనున్నారు. సాయంత్రం 6 గంటలకు త్రివేంద్రంలో కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ తో సమావేశమవుతారు. ప్రస్తుత రాజకీయ స్థితులపై ఇద్దరు చర్చిస్తారు. పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దేశ రాజకీయ పరిణామాల గురించి మాట్లాడతారు. ముఖ్యమంత్రి కేరళ పర్యటనలో భాగంగా రామేశ్వరం, శ్రీరంగం దేవాలయాలను సందర్శిస్తారు.
