సిద్దిపేట నియోజకవర్గం ప్రాచీన కోవెలలకు కొలువైనది అని..నియోజకవర్గం లోని పురాతన ఆలయాలను అభివృద్ధి చేసి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చామని మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో వెలసియున్న శ్రీ శరబెశ్వర ఆలయ 83 వ వార్షికోత్సవం లో పాల్గొని స్వామి వారి రుద్రాభిషేక పూజా కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ.. గొప్ప ప్రాశస్త్యం..చారిత్రాత్మక ఆలయాలకు నెలవు మన సిద్దిపేట అని..ఎన్నో పురాతన, ప్రాచీన ఆలయాలు కాకతీయుల కాలం నాటి ఆలయాలు మన ప్రాంతంలో ఉన్నాయన్నారు..అలాంటి ఆలయాలను అభివృద్ధి చేసుకొని వాటి చరిత్రను కాపాడుకోనే విధంగా పూర్వ వైభవాన్ని తెస్తున్నామన్నారు.. పురాతన ఆలయాలను గుర్తించి అభివృద్ధి చేస్తున్న ఘనత టి ఆర్ ఎస్ ప్రభుత్వందేన్నారు.. సిద్దిపేట శరబెశ్వర ఆలయానికి గతంలోనే ఆలయ అభివృద్ధి కి 50లక్షలు మంజూరు చేశామని త్వరలోనే పనులు ప్రారంభం చేస్తామన్నారు.
