తెలుగు ఇండస్ట్రీ లో ప్రస్తుతం టాప్ లో ఉన్న హీరోల్లో మహేష్ బాబు ఒకరు.మహేష్,పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘మహర్షి’.ఈ చిత్రం రిలీజ్ కోసం మహేష్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు.మరో మూడు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇది మహేష్ కు 25సినిమా కావడం మరో విశేషం.అయితే ఇది రిలీజ్ అవ్వకముందే ఒక రికార్డు బ్రేక్ చేసింది.రాజమౌళి బాహుబలి సినిమాతో తెలుగు ఇండస్ట్రీ గొప్పతనాని ప్రపంచానికి చాటిచెప్పారు.అలాంటి సినిమాను దాటేసింది మహర్షి.
ఇంతకు అసలు విషయానికి వస్తే అమెరికాలో ఈ నెల 8న 2500 థియేటర్లలో ప్రీమియర్ షో రిలీజ్ చేయన్నునారు.ఇప్పటివరకూ ఏ ఒక్క సినిమా కూడా ఇన్ని షో లు రిలీజ్ చేయలేదు.ఇదంతా స్వయంగా అమెరికన్ డిస్ట్రిబ్యూటర్ నే చెప్పారు.జక్కన సినిమా బాహుబలి2 కూడా 2000లకు మించలేదు.రిలీజ్ కి ముందు ఇంత రెస్పాన్స్ ఉంటే రిలీజ్ అయితే బంపర్ హిట్ అని చెప్పాలి.