ఏపీలో గత మూడు నాలుగు రోజులుగా నాలుగు జిల్లాలో ఫాని తుఫాన్ బీభత్సం సృష్టించిన సంగతి తెల్సిందే. అధికారంగా ఎనబై కోట్ల ఆస్తి నష్టం జరిగింది. కొన్ని వందల పశువులు మృత్యువాతపడ్డాయి. పంటపోలాలు ,భవనాలు,ఇళ్ళు నేలకూలాయి. అయితే ఇక్కడ తుఫాన్ బీభత్సం సృష్టిస్తుంటే మరోవైపు మంత్రులుగా ఉన్న టీడీపీ నేతలు ఫారన్లో జల్సాలు చేస్తున్నారు.
మంత్రి పితాని సత్యనారాయణ ఫ్రాన్స్ ,స్విట్జర్లాండ్ పర్య్టటనకు రెడీ అయ్యారు. మరో మంత్రి అచ్చెన్నాయుడు ఇప్పటికే దుబాయికి చేరుకుని సేద తీరుతున్నారు. ఇక యనమల రామకృష్ణుడు బ్రిటన్,ప్రాన్స్ ,రోమన్ లో తిరుగుతున్నారు.ఇక మరో మంత్రి గంటా శ్రీనివాస్ రావు మాత్రం విశాఖ హెల్త్ రిసార్ట్ లో ఈతకోలనులో సేదతీరుతున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
అయితే తన కూతురు కోసం లండన్ కు వెళ్ళనున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై విరుచుకుపడిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మంత్రుల తీరుపై స్పందించకపోవడం విడ్డూరం అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి..