ఒడిశాను బీభత్సం సృష్టించిన ఫణి తుపాన్ శనివారం మధ్యాహ్నం నాటికి పశ్చిమబెంగాల్ తీరాన్ని దాటనుంది. అర్దరాత్రి పన్నెండున్నర గంటలకు బెంగాల్ తీరాన్ని తాకిన తుపాన్ వల్ల ఖరగ్‌పూర్ నగరంలో గంటలకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. తుపాన్ పశ్చిమబెంగాల్ లోని హుగ్లీ జిల్లా ఆరాంబాగ్ నడియా మీదుగా బంగ్లాదేశ్ వైపు పయనిస్తోంది. ఫణి తుపాన్ క్రమేణా బలహీనపడుతూ బంగ్లాదేశ్ వైపు వెళుతోంది. ఈ తుపాన్ ప్రభావం వల్ల బెంగాల్ కోస్తా తీరంలోని దిఘా, మందర్ మని, తాజ్ పూర్, సందేశ్ ఖలీ, కొంటాయ్, ఖరగ్ పూర్ నగరాల్లో భారీవర్షంతో పాటు చెట్లు నేలకూలాయి. ఖరగ్ పూర్ నగరంలో 95 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తుపాన్ గాలుల వల్ల ప్రమాదాలు జరగకుండా ముందుజాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
