ఏపీలో ప్రజలు తీర్పు అర్థమయ్యే టీడీపీ అధినేత చంద్రబాబు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. శనివారం వైసీపీ పార్టీ ఆఫీస్లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.5 మాసాలనుండి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేనీ మీరు వైసీపీ అధినేత వైఎస్ గురించి మాట్టాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అంతేకాదు క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఎవరిని పిలుస్తారు. చంద్రబాబు మీ పార్టీ మంత్రులు దాక్కున్నారా. అసలు క్యాబినెట్ మంత్రులు ఎవరూ కనబడటం లేదు. ఓడిపోతామనే తెలిసి వారందరు సొంత పనుల్లో ఉన్నారు. వారంతా చంద్రబాబు రోత చూసి విసిగిపోతున్నారు. ఐదేళ్లుగా అవినీతి, అరాచకాలు చేసి… ఇప్పుడు చంద్రబాబు మాట్లాడుతున్న తీరు హాస్యాస్పదంగా ఉంది. ఓటమి భయంతో చంద్రబాబు పిచ్చిగా మాట్లాడుతున్నారని పద్మ అన్నారు. ఇంకా చెప్పాలంటే వైఎస్ జగన్ నవ్వినా ఆయన ఏడుస్తున్నారు. వైఎస్ జగన్‌కు జీవించే హక్కు లేకుండా చంపాలని చూశారు. కనీసం ఆయనకు సినిమాకు వెళ్లే హక్కు కూడా లేదా. టీటీడీ బంగారం వ్యవహారంపై స్పందించని చంద్రబాబు వైఎస్ జగన్ సినిమాకు వెళ్తే మాత్రం మాట్లాడతారు. మీ లోకేష్ ఎక్కడున్నారో చెప్పండి అంటూ ఫైర్ అయ్యారు.
