వాషింగ్టన్ లోని ఫ్లోరిడాలో ప్రమాదకర ఘటన చోటుచేసుకుంది. ల్యాండింగ్ సమయంలో అదుపుతప్పిన బోయింగ్ 737 కమర్షియల్ జెట్ నదిలోకి దూసుకువెళ్లింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. వివరాలు… 136 మంది ప్రయాణికులతో బోయింగ్ విమానం క్యూబా నుంచి బయల్దేరింది. అయితే నావల్ స్టేషన్ గంటానమో బేలో ల్యాండ్ అవుతున్న సమయంలో జాక్సన్‌విల్లేలోని సెయింట్ జాన్స్ నదిలోకి దూసుకువెళ్లిందని నావల్ ఎయిర్‌స్టేషన్ అధికార ప్రతినిధి తెలిపారు. శుక్రవారం రాత్రి 9.40 గంటల సమయంలో జరిగిన ఈ ఘటన నుంచి ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారని జాక్సన్‌విల్లే మేయర్ ట్వీట్ చేశారు. వారంతా బతికే ఉన్నారని కుటుంబ సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఇక ఈ ఘటనపై స్పందించిన జాక్సన్‌విల్లే షరిఫ్స్ ఆఫీస్ కూడా ప్రమాద సమయంలో ఎటువంటి ప్రాణ నష్టం జరుగలేదని ట్వీట్ చేసింది. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.