Home / SLIDER / మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పథకాల అమలుపై సమీక్ష

మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పథకాల అమలుపై సమీక్ష

తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పథకాల అమలుపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి అన్నారు. శనివారం కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి రవీంద్ర పవార్ సి.యస్ సమక్షంలో రాష్ట్రంలో కేంద్ర మహిళా,శిశు సంక్షేమ శాఖ కు సంబంధించిన పథకాల అమలు తీరుపై సమీక్షించారు.ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, కేంద్ర మహిళా శిశుసంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ రాజేశ్ కుమార్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్, మహిళా, శిశుసంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి జగధీశ్వర్, విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ విజయేంద్ర బోయి, వైద్య శాఖ అడిషనల్ సెక్రటరీ సోని బాలదేవి, ఆర్ధిక శాఖ జాయింట్ సెక్రటరీ ఆర్.రవి లతో పాటు యూనిసెఫ్, గిరిజన, మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.
 
 
 
 
ఈ సందర్భంగా సి.యస్ మాట్లాడుతూ ఇటువంటి సమావేశాల ద్వార పథకాల అమలును మరింత సమర్ధవంతంగా అమలు చేయడంతో పాటు, లోటు పాట్లను సరిదిద్దుకొని రాష్ట్రానికి ఉపయోగపడేలా పనిచేయడానికి ఉపకరిస్తాయన్నారు. గ్రామ స్ధాయిలో వివిధ శాఖల మధ్య సమన్వయంతో పని చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. రాష్ట్రంలో అంగన్ వాడీ కేంద్రాలలో తెలంగాణ ఫుడ్స్ తయారు చేసిన బాలామృతాన్ని అందిస్తున్నామని సి.యస్ వివరించారు. అంగన్ వాడీలలో బాలల హాజరు సంఖ్య నమోదు చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్ ను వినియోగించే విషయాన్నిపరిశీలించాలన్నారు. అంగన్ వాడీలు, ప్రాథమిక పాఠశాలల మద్య అనుసంధానానికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా న్యూట్రీబాస్కెట్ ను అందిస్తున్నట్లు వారికి తెలిపారు.
 
 
 
కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పోషణ అభియాన్ పథకానికి సంబంధించిన నిధుల వినియోగ వివరాలు సమర్పిస్తామని, తగు సిబ్బందిని నియమిస్తామని, శిక్షణను అందిస్తామని అన్నారు. అంగన్ వాడి సెంటర్లకు సంబంధించి 35,700 పని చేస్తున్నాయని, ఇన్సూరెన్స్ కవరేజికి సంబంధించి సిబ్బంది వివరాలను LIC కి అందిస్తామని తెలిపారు. లబ్ధిదారుల ఆధార్ సీడింగ్ చేస్తున్నామని, అంగన్ వాడీలలో టాయ్ లెట్, మంచినీటి వసతికి కృషి చేస్తున్నామన్నారు.కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి మాట్లాడుతూ కేంద్ర పథకాల అమలు తీరును సమీక్షించడానికి రాష్ట్రాలలో పర్యటిస్తున్నామని తెలంగాణ రాష్ట్రంలో అంగన్ వాడీల పనితీరు, పోషణ్ అభియాన్, ప్రధానమంత్రి మాతృవందన యోజన లాంటి పథకాల అమలును సమీక్షించామన్నారు. అంగన్ వాడీలకు సంబంధించి ఆధార్ ఎన్ రోల్ మెంటు కిట్ల సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. పోషణ అభియాన్ కు సంబంధించి శిక్షణా కార్యక్రమాలను చేపట్టాలన్నారు. కెపాసిటి బిల్డింగ్ కు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. నిధుల వినియోగంపై ఎప్పటికప్పుడు UC లు ఇవ్వాలన్నారు. మరిన్ని వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. స్టేట్ హోమ్స్, వన్ స్టాప్ సెంటర్ స్కీం, ఉమెన్ హెల్ప్ లైన్స్, మహిళా శక్తి కేంద్రాలు, ఉజ్వల స్కీం, స్వధార్ గృహకేంద్రాలు, బేటి బచావో, బేటి పడావో, నేషనల్ క్రచ్ స్కీం, DBT అమలు, వీట్ బేస్ డ్ న్యూట్రీషన్ ప్రోగ్రాం స్కీం ఫర్ అడల్ట్స్ అండ్ గర్ల్స్, ఇంటిగ్రేటేడ్ చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీసెస్ లాంటి పథకాలపై అధికారులతో సమీక్షించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat