ప్రముఖగాయని, గాన కోకిల జానకి ఆసుపత్రిలో చేరారు. మైసూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో ఆమె చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఆమె బంధువుల ఇంట్లో ఉండగా కాలుజారి పడిపోవడంతో ఆమె కుడి కాలికి ఫ్రాక్చర్ అయింది. తీవ్రంగా నొప్పి రావటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. ఆమె ప్రస్తుతం కోలుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉండగా.. ఆమె అభిమానులు, ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
