సహాజంగా మనం పడుకున్న తర్వాత నిద్ర వస్తుంది. నిద్రలో కలలు వస్తాయని ఎవరైనా చెప్తారు. కానీ నిద్ర తర్వాత మన శరీరం బయట,లోపల వచ్చే మార్పులు ఏంటని అడిగితే ఎవరికైన ఏమో అనే సమాధానం వస్తుంది. అయితే ఆ మార్పులు ఏమిటో ఒక లుక్ వేద్దామా..?
1)ఉష్ణోగ్రత
నిద్ర సమయంలో శరీరం పనిచేయదు కాబట్టి శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. మరి ముఖ్యంగా 2.30గంటల సమయంలో శరీరం చాలా తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉంటుందని పరిశోధకులు చెబుతారు
2)కళ్లు
నిద్ర సమయంలో కళ్లు ఏమి చేస్తాయని ఎవర్ని అయిన అడిగితే ఏమంటారు. కళ్లు మూసుకుంటాం అని సమాధానం చెప్తారు. అయితే, కనురెప్పలు మూసుకున్న కానీ కళ్లు మాత్రం అటు ఇటు కదులుతాయి. అయితే మనం గమినిస్తే మనం పడుకున్నాక కళ్ళు కదిలిన తర్వాతే నిద్ర వస్తుంది
3)కదలికలు
నిద్రలోని తొలిదశలో శరీరం కదులుతుంది. కొన్ని కొన్ని సార్లు ఈ కదలికలకు మనం నిద్రలేస్తాం..
4)కండరాలకు విశ్రాంతి
కాళ్లు ,చేతులు సహా రోజంతా పనిచేసిన శరీరంలోని ఇతర భాగాల కండరాలు ఈ సమయంలో విశ్రాంతి తీసుకుంటాయి.
5)శరీరం
మన శరీరానికి ఉన్న మంచి గుణాల్లో తన పని తాను చేసుకోవడం ఒకటి. రాత్రి సమయంలో చర్మం తన మృతకణాలను తొలగించుకోవడంతో పాటుగా కొత్త కణాలను ఇదే సమయంలో ఉత్పత్తి చేసుకుంటుంది
6)గొంతు పరిమాణం
నిద్రపోతున్న సమయంలో శ్వాస పంపిణీ మినహా గొంతుకు పెద్దగా పని ఉండదు. కాబట్టి పరిమాణం తగ్గిపోతుంది. బహుశా గురకకు ఇది కూడా ఒక కారణం అని కొందరంటారు.
7)హార్మోన్లు
మనం నిద్రపోతున్న సమయంలో హార్మోన్లు ఉత్తేజితమవుతాయి. ఇవి రోజంతా శరీరంలో ప్రసరిస్తున్నా రాత్రి నిద్ర సమయంలో కణాల ఉత్పత్తి మార్పిడిని చేస్తాయి
8)రోగనిరోధకత
మిగతా సమయల్లో పోలిస్తే నిద్రపోతున్న సమయంలోనే రోగ నిరోధకత కారకాలు అత్యుత్తమంగా పనిచేస్తాయి. అయితే, మనం సరిగా నిద్రపోకపోతే అవి సరిగా పనిచేయకపోవడం వలన మనకు రోగాలు త్వరగా వస్తాయి.
9)బరువు తగ్గుతాం
నిద్రపోతున్న సమయంలో శరీరం నుంచి నీరు చెమట రూపంలో బయటకు రావడం వలన మనం బరువు కాస్త తగ్గుతాం. అయితే,ఉదయమూ చెమట వస్తుంది కానీ ఈ సమయంలో మనం దేన్నైనా త్రాగచ్చు. తినచ్చు
10)నోరు
నిద్రపోతున్న సమయంలో మనం తినము కాబట్టి లాలాజలం ఉత్పత్తి కాదు. దీని ఫలితంగా నోటిలో నీటి శాతం తగ్గిపోయి పొడిబారుతుంది. దీంతో నిద్రనుంచి లేవగానే మనకు దాహాంగా అన్పిస్తుంది
11)కొలతలు
సాయంత్రం కంటే ఉదయమే మనుషులు కాస్త ఎక్కువ పోడవుంటారు అని పలు పరిశోధనలో తేలింది. ఇందుకు ప్రధానమైన కారణం ఏంటంటే రాత్రుళ్లు మన వెన్నుముక్కపై బరువు తగ్గి అది కాస్త విశాలంగా ఉంటుంది
12)రక్తప్రసరణ
నిద్ర సమయంలో శరీరం పనిచేయదు. కాబట్టి రక్తప్రసరణ వేగం కాస్త తగ్గుతుంది
13)నిద్రలో నడక
నిద్రపోతున్న సమయంలో నడవడం చాలా మందికి అలవాటుంటుంది.కానీ నిద్రలో కాలు కదపడం ,చేతులు పక్కకు వేయడంలాగే నడవడం కూడా ఒక ప్రక్రియనే అని అందరూ అంటుంటారు.
14)కలలు
మనం సహాజంగా నిద్రపోతున్న సమయంలో ఈ రోజు ఏ కల కూడా రాలేదు అని అనుకుంటే పొరబడినట్లే. అయితే ఒక మనిషి సగటున రోజుకు మూడు నుంచి ఐదు కలలు కంటారు.
15)విషపదార్ధాల తొలగింపు
నిద్రపోతున్న సమయంలో శరీరంలోని విషవాయువులను మన దేహాంలోని పారిశుధ్య కార్మికులు ఒక చోటకు చేరుస్తాయి.మర్నాడు వీటినే మనం వివిధ రూపాల్లో బయటకు పంపుతాం
16)శ్వాస ఆగడం
చాలా మందికి నిద్రపోతున్న సమయంలో శ్వాస అగిపోతుంది. అయితే మరికొంతమందికి అయితే చాలా సేపు శ్వాస అగుతుంది. కానీ ఈ సమయంలో నోటి ద్వారా శ్వాస తీసుకుంటారు.
